News December 29, 2024
విజయవాడ: నేడు రామ్‌చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ
విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.
Similar News
News January 6, 2025
ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా
ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.
News January 5, 2025
కృష్ణా: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక
2025-26 సంవత్సరానికి సంబంధించి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఈనెల 7,8 తేదీలలో బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నామని APCPDCL తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పై తేదీలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వినియోగదారులు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామంది.
News January 5, 2025
ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలోని ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలపై కలెక్టర్ లక్ష్మిశ విచారణకు ఆదేశించారు. పెండ్యాల ఇసుక రీచ్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులు, మీడియా కథనాలపై స్పందించిన కలెక్టర్ దీనిపై ఆదివారం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం వెలువడింది.