News February 18, 2025
విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.
Similar News
News December 4, 2025
GNT: మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరులో 1933 జులై 4న జన్మించారు. ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా, మచ్చలేని నేతగా, గొప్ప పరిపాలకుడిగా ఆయనకు మంచి పేరుంది.
News December 4, 2025
పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.
News December 4, 2025
స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.


