News June 16, 2024
విజయవాడ: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ రామకృష్ణ

ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సీపీ రామకృష్ణ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నగర వ్యాప్తంగా క్రమం తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 24, 2025
గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు..!

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని, అనుభవం లేని అర్హత లేని వ్యక్తులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకొనే వారికి యాంటీబయోటిక్ మందులను విక్రయిస్తున్నారంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 24, 2025
నేటి నుంచి గుడివాడలో రాష్ట్ర స్థాయి పోటీలు

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఖో.. ఖో, బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించనున్నారు. 58వ రాష్ట్రస్థాయి ఖో.. ఖో సీనియర్ చాంపియన్షిప్ పోటీలు, సాయంత్రం నిర్వహించే 87వ జాతీయస్థాయి సీనియర్ బ్యాట్మెంటన్ చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.