News June 16, 2024

విజయవాడ: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ రామకృష్ణ

image

ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సీపీ రామకృష్ణ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నగర వ్యాప్తంగా క్రమం తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News January 22, 2026

EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News January 22, 2026

కృష్ణా: 23న జిల్లాలో ‘నా ఇండియా నా ఓటు’

image

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ‘నా ఇండియా నా ఓటు’ అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.

News January 22, 2026

కృష్ణా జిల్లా పరిషత్ బడ్జెట్ వివరాలే ఇవే.!

image

జిల్లా పరిషత్‌కు సంబంధించి 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనాల బడ్జెట్‌ను ఆమోదించారు. 2025-26 సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.143.97కోట్లు కాగా ఆదాయం అంచనా రూ.817.82కోట్లకు గాను ఖర్చు అంచనా రూ.841.44కోట్లు, ముగింపు నిల్వ అంచనా రూ.120.34కోట్లుగా చూపారు. 2026-27 బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.120.34కోట్లు కాగా ఆదాయం అంచనా రూ.2123.99కోట్లు కాగా ముగింపు నిల్వ అంచనా రూ.136.47కోట్లుగా చూపించారు.