News November 6, 2024
విజయవాడ: పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పంచ్ ప్రభాకర్‌పై విజయవాడలో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మొగల్రాజపురానికి చెందిన డి.రాజు అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి ‘పంచ్ ప్రభాకర్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.
Similar News
News December 9, 2024
విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 10లోపు https://aaiclas.aero/career వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన వారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30వేల వేతనం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
News December 9, 2024
అమెరికాలో స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్‌గా విజయవాడ కుర్రాడు
‘యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా స్టూడెంట్ గవర్నమెంట్’ ప్రెసిడెంట్‌గా విజయవాడకు చెందిన గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో సీఎస్‌సీ అండర్ గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్న గొట్టిపాటి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన 3 క్యాంపస్‌లకు సంబంధించి 60 వేల విద్యార్థులకు మన విజయవాడ వాసి ప్రతినిధిగా ఎన్నికవ్వడం విశేషం.
News December 9, 2024
కృష్ణా: వరి రైతులకు APSDMA అధికారుల కీలక సూచనలు
కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తడిసిన వరి పనలు కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేయడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేలా పిచికారీ చేయాలన్నారు.