News December 30, 2024

విజయవాడ: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

image

విజయవాడలో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్‌ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లపై చర్చించారు. కాగా పవన్‌ ప్రీరిలీజ్‌కు హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 23, 2025

రేపు ఘంటసాలలో ‘రైతన్నా మీ కోసం’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కనపర్తి శ్రీనివాసరావు శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

News November 23, 2025

కృష్ణా: బెల్టు షాపులపై ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.!

image

గ్రామస్థాయిలో బెల్టు షాపు కనిపిస్తే ‘బెల్టుతీస్తా’ అన్న ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం డోర్ డెలివరీ ప్రారంభించడంతో బెల్టు వ్యాపారం అడ్డదారులు వేస్తూ దూసుకుపోతోందని సమాచారం. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం ఏరులై పారుతుంటే, ఆ శాఖ అధికారులు ఈ దందాలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News November 23, 2025

మచిలీపట్నం: నాన్ వెజ్‌కు రెక్కలు.!

image

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్‌కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.