News December 30, 2024
విజయవాడ: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు
విజయవాడలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లపై చర్చించారు. కాగా పవన్ ప్రీరిలీజ్‌కు హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 22, 2025
VJA: 24 నుంచి జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు
విజయవాడ పటమటలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను DRO ఎం.లక్ష్మీనరసింహారావు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పోటీల్లో 5 రాష్ట్రాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లక్ష్మీనరసింహారావు వివరించారు.
News January 21, 2025
వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2025
పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి
పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.