News March 20, 2024
విజయవాడ: పవర్ లిఫ్టింగ్‌లో శ్రీదేవికి కాంస్య పతకం
న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.
Similar News
News October 12, 2024
ఈ దసరా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం, అధైర్యంపై ధైర్యం, చెడుపై మంచి విజయం సాధించిన రోజైన విజయదశమి పర్వదినం విజయానికి సంకేతంగా నిలిచిందని కొల్లు పేర్కొన్నారు. దుర్గా మాత కరుణతో ఈ దసరా పర్వదినం అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానన్నారు.
News October 12, 2024
విజయవాడ: శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం విశిష్టత
కనకదుర్గమ్మ అమ్మవారు శనివారం విజయ దశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందని పండితులు తెలిపారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా తనను కొలిచిన భక్తులకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుందన్నారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అని పండితులు చెబుతారు.
News October 12, 2024
ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు
ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 113 మద్యం షాపుల కోసం 5,787 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ప్రతి షాపునకు సగటున 51 దరఖాస్తులు దాఖలైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ నెల 12,13వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం 14వ తేదీన జిల్లా అధికారుల సమక్షంలో డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.