News April 11, 2024
విజయవాడ పశ్చిమలో అత్యధికం, మచిలీపట్నంలో అత్యల్పం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడగా, మచిలీపట్నంలో అత్యల్పంగా 8 మంది బరిలో నిలిచారు. జిల్లాల విభజన అనంతరం స్థానికంగా రాజకీయ పరిస్థితులు మారినందునా తాజా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. కాగా గత ఎన్నికల్లో పశ్చిమలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడం విశేషం.
Similar News
News March 27, 2025
కృష్ణా: నేడు 40 డిగ్రీలపై ఎండ

కృష్ణా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. గురువారం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. నందివాడ 40.7°, బాపులపాడు 41.5°, గన్నవరం 42.4°, కంకిపాడు 41.2°, పమిడిముక్కల 40.2°, పెనమలూరు 41.6°, ఉంగుటూరు 42.2°, పెదపారుపూడి 41.1°, తోట్లవల్లూరు 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.
News March 27, 2025
MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇనుగుదురుపేట వర్రిగూడెంలో ఈ నెల 21న సంచలనం సృష్టించిన టోపీ శీను హత్య కేసును మచిలీపట్నం పోలీసులు ఛేదించారు. బుధవారం ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇల్లీగల్ కేసుకు సంబంధించి హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కడవకొల్లు దయాకర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News March 27, 2025
కృష్ణాజిల్లాలో వివిధ రాష్ట్రాల యువకుల శ్రమదానం

కేరళలోని బైబిల్ కళాశాల యువకులు బుధవారం కృష్ణాజిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిజోరం రాష్ట్రం యువకుడు చోచో, తమిళనాడు యువకులు శివబాలన్, అడ్రెల్లా, కాకినాడ యువకుడు శామ్యూల్ గ్రామాన్ని సందర్శించారు. చల్లపల్లి పాస్టర్ దైవసేకుడు గోల్కొండ డేవిడ్ సూచన మేరకు గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన రహదారుల పక్కన పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు.