News September 11, 2024
విజయవాడ: పాడైన విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి..

విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News November 12, 2025
పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News November 12, 2025
రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లాకు రెండో స్థానం

అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని అభినందించారు.
News November 11, 2025
మచిలీపట్నం: టిడ్కో ఇళ్లను ఇవ్వాలని వినతి

టిడ్కో ఇళ్ల ఫ్లాట్లను లబ్దిదారులకు అందించాలని ఐద్వా మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. 2017వ సంవత్సరంలో పేదల గృహాల కొరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజల వద్ద రూ.500ల నుంచి రూ.12,500, రూ.25,000లు వసూళ్లు చేసి గృహాలు నిర్మించారన్నారు.


