News April 1, 2025

విజయవాడ: ‘పేదల భద్రతే ప్రభుత్వ లక్ష్యం’

image

ఎన్‌టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని, ఇంటివద్దే పింఛన్ల పంపిణీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి తెలిపారు. మంగళవారం విజయవాడ రూరల్, గొల్లపూడి రెండో సచివాలయంలో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,28,813 లబ్ధిదారులకు రూ. 98.11 కోట్లు పంఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.

Similar News

News April 4, 2025

వికారాబాద్‌: పెద్దేముల్‌ హత్యకు గురైన యశోద వివరాలు

image

వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళ ఎవరు అనేది నిర్ధారించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బొంరాస్‌పేట మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2025

ధనవంతులు అయ్యేందుకు టిప్స్!

image

కొన్ని పద్ధతులు పాటిస్తే ధనవంతులు కావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకే ఆదాయంతో మీరు ధనవంతులు కాలేరు. కచ్చితంగా రెండో ఆదాయం ఉండాల్సిందే. మీకు వచ్చిన ఆదాయంలో పొదుపు చేయగా మిగిలిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి. ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ప్రతీ రూపాయికీ లెక్క ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ పొదుపు చేయాలి. ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది.

News April 4, 2025

టీ.నర్సాపురం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) గుండెపోటుతో బస్సులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి బస్సులో హాస్పటల్‌కి బయలుదేరారు. మార్గమధ్యలో రాజు పోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటుతో రావడంతో మృతి చెందారు. తన భుజంపై ప్రాణాలు విడిచిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. 

error: Content is protected !!