News January 23, 2025
విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు
విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు.
Similar News
News January 24, 2025
కృష్ణా: బీపీఈడీ&డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News January 24, 2025
కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.
News January 24, 2025
నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు
విజయవాడకు శుక్రవారం సీఎం చంద్రబాబు రానున్నారు. 4 రోజుల దావోస్ పర్యటన అనంతరం ఆయన గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళతారు.