News February 14, 2025
విజయవాడ: పోలీసులు కీలక ప్రకటన

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. నగర పరిధిలో ఎక్కవ మంది గుమికూడవద్దన్నారు. కర్రలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకొని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 18, 2025
GNT: 108లో మహిళకు సుఖ ప్రసవం.. ఆడబిడ్డ జననం

108 అంబులెన్స్లో శనివారం ఓ మహిళకు డెలివరీ అయింది. గుంటూరు జిల్లా 108 అంబులెన్స్ మేనేజర్ బాలకృష్ణ అందించిన సమాచారం మేరకు.. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంకు చెందిన రాణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, గరువుపాలెం వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది శంకర్, పైలెట్ కిషోర్ బాబు, యెహోషువాలు కలిసి ఆమెకు సుఖప్రసవం చేయగా.. ఆడబిడ్డ జన్మించింది.
News October 18, 2025
అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

టి. సుండుపల్లి మండలానికి చెందిన రాకేశ్, చంద్రగిరి మండలానికి చెందిన నవ్య శ్రీ బీటెక్ చదివే రోజులలో ప్రేమలో పడ్డారు. చదువు పూర్తయిన అనంతరం బెంగళూరులో ఉద్యోగం సంపాదించారు. వారిద్దరి పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని వారు కోరారు.
News October 18, 2025
జిప్మర్లో 118 పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER)118 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.