News March 7, 2025

విజయవాడ: పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

image

టీడీపీ కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. కాగా ఈ కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసు నిమిత్తం పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. కాగా పోసానికి కోర్టు ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించగా.. అన్నమయ్య(D) రాజంపేట జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈనెల 13తో ఆయన రిమాండ్ గడువు ముగియనుంది.

Similar News

News October 28, 2025

ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

image

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.

News October 28, 2025

LRS గడువు పొడిగింపు

image

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

News October 28, 2025

సంగారెడ్డి: 3,750 ఏకరాల్లో ఆయిల్ పామ్ సాగు

image

సంగారెడ్డి జిల్లాలో 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే కృషి చేయాలని, ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.