News February 2, 2025

విజయవాడ: ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బనారస్(BSBS) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న MAS- BSBS(నం.06193), 12న BSBS- MAS (నం.06194) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలులో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News February 18, 2025

వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలా?

image

కసరత్తులతో చెమటలు చిందించకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సీడ్స్, ప్రోటీన్ పదార్థాలు తినాలి. షుగర్, ఫ్రై, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినకూడదు. అలాగే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, పార్కులో నడవడం వల్ల కేలరీలు కరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది. తగినన్ని నీళ్లు తాగి, తగినంత నిద్ర పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

News February 18, 2025

మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ బాయ్స్, గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలకు హవేలి ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం కరుణాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన నవీన్, ప్రకాష్ సింగ్, రోహిత్ గౌడ్‌లు రన్నింగ్, షాట్ ఫుట్ విభాగాల్లో ఎంపికయ్యారని అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నేడు మంగళవారం జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను అభినందించారు.

News February 18, 2025

మనూ భాకర్‌కు బీబీసీ పురస్కారం

image

భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంథాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్‌నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!