News January 23, 2026

విజయవాడ: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని మోసం

image

మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రీస్తురాజుపురానికి చెందిన చెందిన ఓ బాలిక(15)ను అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు వసంత్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ వెంకటరమణ గురువారం తెలిపారు.

Similar News

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.

News February 18, 2026

మామునూర్‌లో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటుకు అవకాశం

image

వరంగల్ మామునూరు విమానాశ్రయంలో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో విమానయాన శిక్షణకు అడుగులు పడటం వల్ల మంచి పరిణామం. ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు ద్వారా పైలట్ ట్రైనింగ్, ఏవియేషన్ టెక్నికల్ కోర్సులు, గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ వంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

News February 18, 2026

పారదర్శకంగా జనాభా గణన నిర్వహించాలి: కలెక్టర్

image

సమగ్ర కార్యాచరణతో, అత్యంత పారదర్శకంగా జనాభా గణనను ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో బుధవారం జనాభా గణన-2027కు సంబంధించి మొదటి దశ గృహ స్థాయి బ్లాకుల విభజన, మాస్టర్ అధికారుల శిక్షణపై ఆయన సమీక్షించారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ నిర్వహిస్తామని, ప్రతి ఇంటి భౌగోళిక, గృహ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు.