News September 6, 2024

విజయవాడ: ‘ఫేక్ కథనాలను వ్యాప్తి చేస్తే కఠినచర్యలు’

image

విజయవాడ వరదలపై ఫేక్ కథనాలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విజయవాడలో లక్షల మంది ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దురుద్దేశంతో ఫేక్ కథనాలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 18, 2025

కృష్ణా జిల్లాలో వర్షం.. దీపావళి వ్యాపారులకు ఆటంకం

image

దీపావళి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, గుండు సామాగ్రి దుకాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వ్యాపారులకు ఆటంకంగా మారింది. పండుగ సీజన్‌లో అధిక ఆదాయం ఆశించిన వ్యాపారులకు ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనల పరిమితులు కూడా పెద్ద సవాలుగా మారాయి.

News October 18, 2025

కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

image

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

News October 18, 2025

మచిలీపట్నం: పిచ్చి మొక్కలు తొలగించిన కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైతు బజారు పక్కన ఉన్న పశువుల ఆస్పత్రిలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.