News June 16, 2024
విజయవాడ: ‘బాబాయ్ అంటూ ఇల్లు మొత్తం దోచేశారు’

ఎనికేపాడు నివాసి అయిన పెరూరి సత్యనారాయణ (68), గోవిందమ్మ దంపతులపై శుక్రవారం రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. వారు నిర్వహిస్తున్న కిరాణా షాపుకి వచ్చిన ఒక వ్యక్తి బాబాయ్ అంటూ మాట కలిపి షాపు షటర్ దింపి మరొక ఇద్దరితో కలసి వారిద్దరి చేతులు కట్టేసి రూ.1.80 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం దోచేశారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News November 30, 2025
కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.
News November 30, 2025
కృష్ణాజిల్లాలో ఎంత మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే.?

కృష్ణాజిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 7,072 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరంతా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, గుడివాడలోని పీ. సిద్దార్థ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2008 గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 12,052 మంది ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 7,072 మందికి తగ్గింది. #InternationalAidsDay.
News November 30, 2025
కృష్ణా జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.


