News August 16, 2024
విజయవాడ: బార్‌లో మద్యం తాగి వ్యక్తి మృతి
విజయవాడ సింగ్ నగర్‌లోని రూప లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 12, 2024
షర్మిలను కలిసిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
News September 12, 2024
విజయవాడ: నీటి గోతిలో ఇరుక్కుపోయిన మంత్రి కారు
విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.
News September 12, 2024
విజయవాడ వరద బాధితులకు కీలక ప్రకటన
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.