News November 10, 2024
విజయవాడ: భవానీ దీక్షల మాలధారణ, విరమణ తేదిలివే!

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల కార్యక్రమ సన్నాహకాలపై శనివారం ఆలయ EO కేఎస్ రామారావు, CP రాజశేఖరబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 11- 15 వరకు భవానీ దీక్షల మాలధారణ, డిసెంబర్ 14న కలశజ్యోతి, డిసెంబర్ 21- 25 వరకు దీక్షల విరమణ జరుగుతాయని CP రాజశేఖరబాబు చెప్పారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశానికి హాజరైన అధికారులతో సీపీ చర్చించారు.
Similar News
News December 15, 2025
రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 15, 2025
ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.
News December 15, 2025
కృష్ణా ఫెన్సింగ్కు కాంస్య పతకాలు

గుంటూరు జిల్లా వెనిగండ్లపాడులో జరిగిన అంతర జిల్లాల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో బాలికల శాబర్ జట్టు, బాలుర ఇప్పి జట్టు, బాలుర ఫోయిల్ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ శిక్షకులు ధనియాల నాగరాజు విజేతలను అభినందనలు తెలిపారు.


