News September 21, 2024
విజయవాడ: మరోసారి బాడీ స్పా సెంటర్‌పై దాడి
విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రం సైతం బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 15, 2024
కృష్ణా: భార్యా భర్తలకు 9 షాపులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సజావుగా ముగిసింది. అయితే వ్యక్తిగతంగా షాపులు వరించిన వారి నుంచి జోరుగా బేరసారాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులు వేయొచ్చన్న నిబంధనలతో భారీగా సిండికేట్లగా ఏర్పడి షాపులు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు నగరానికి చెందిన వారితో కలిపి 480 షాపులకు దరఖాస్తు చేస్తే ఈ సిండికేట్‌కు 9 దక్కాయి.
News October 14, 2024
నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!
కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు. అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
News October 14, 2024
విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.