News March 23, 2025
విజయవాడ: మహిళపై పెట్రోల్ పోసి హత్యాయత్నం

విజయవాడలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కె.ఎల్ రావుపేటకు చంద్రిక పుల్లారావుతో సహజీవనం చేస్తుంది. పుల్లరావు మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆమె కేకలు వేస్తూ రోడ్డు మీదకు రావడంతో స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 4, 2025
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.
News December 4, 2025
ADB: రోడ్లే దిక్కులేవంటే.. ఎయిర్ పోర్టు ఎందుకు.?

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్లు లేక ఆదివాసీ బిడ్డలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నవంబర్ నెలలో రోడ్లు లేక ముగ్గురు గర్భిణులు ప్రాణాలు విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఎయిర్ పోర్టు తెచ్చి ఆదివాసీలను ఫ్లైట్స్లో తరలిస్తారా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.


