News December 29, 2024
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.
Similar News
News January 6, 2025
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరుగకుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
News January 6, 2025
వేడేక్కిన కృష్ణాజిల్లా రాజకీయం
కృష్ణాజిల్లాలో రాజకీయం మరోసారి వేడేక్కింది. నూజివీడులో YCP నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని MLA యార్లగడ్డ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నూజివీడు TDP నాయకులు స్పందించారు. యార్లగడ్డ తన నియోజకవర్గం చూసుకోవాలని పార్థసారథి వర్గీయులు నిన్న వార్నింగ్ ఇచ్చారు. పక్క నియోజకవర్గాలపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. కాగా సారథి వర్గీయుల వ్యాఖ్యలపై యార్లగడ్డ వర్గం కౌంటర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
News January 6, 2025
సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!
కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు.