News January 3, 2025
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, అగర్తల మధ్య (ట్రైన్ నం. 07029/07030) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ – అగర్తల, అగర్తల – సికింద్రాబాద్ రైలు ఈ నెల 10 నుంచి నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News January 16, 2025
కృష్ణా: అలర్ట్.. ఈనెల 17తో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో అక్టోబర్ 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News January 15, 2025
నందిగామలో దారుణ హత్య
నందిగామ మండలం ఐతవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఐతవరం గ్రామం బీసీ కాలనీలో చింతల నాగేంద్రమ్మ (33) అదే గ్రామానికి చెందిన తోగటి హనుమంతరావుతో ఏడాదిగా సహజీవనం చేస్తోంది. కాగా వీరు కొంతకాలంగా తరచుగా గొడవపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాగేంద్రమ్మను హనుమంతరావు హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 15, 2025
విజయవాడ: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08533 VSKP- SC, నం.08537 VSKP- SC రైళ్లను బుధవారం నడుపుతామని, ఈ రైళ్లలో 9 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయన్నారు. నేడు నం.08533 రైలు మధ్యాహ్నం 3.30కి, నం.08537 రైలు రాత్రి 11.30కి విజయవాడ చేరుకుంటాయన్నారు.