News December 29, 2024
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.
Similar News
News January 22, 2025
దుర్గగుడి ప్రధానార్చకులు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.
News January 22, 2025
జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్
ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.
News January 22, 2025
విజయవాడలో లారీ బీభత్సం.. వ్యక్తి మృతి
విజయవాడలో మంగళవారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహానాడు రోడ్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించగా ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇరువురికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన జక్కుల గోపిగా పోలీసులు నిర్ధారించారు. గాయాలపాలైన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.