News January 19, 2025

విజయవాడ మీదుగా భువనేశ్వర్‌కు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- భువనేశ్వర్‌(BBSR)కు నం.08550 స్పెషల్ రైలు నడుపుతున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదివారం చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:55కు విజయవాడ, సోమవారం ఉదయం 2:15 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ రైలు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుందన్నారు.

Similar News

News November 16, 2025

కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

image

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News November 16, 2025

కృష్ణా జిల్లాలో ‘దాళ్వా’ సాగుపై సందిగ్ధత.!

image

కృష్ణా జిల్లాలో దాళ్వా సాగుపై సందిగ్ధత నెలకొంది. రెండవ పంటగా దాళ్వాకు సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కానీ జలాశయాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల దాళ్వాకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దాళ్వాకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం లోపాయికారిగా రైతులకు ఇదే చెబుతుండటం విశేషం.

News November 15, 2025

కృష్ణా: పంట ఎంపికలో చిక్కుకున్న రైతన్నలు

image

ఖరీఫ్ సీజన్ ముగిసిన తరువాత రెండో పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నా ప్రభుత్వం నుంచి రబీ సీజన్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రబీని అధికారికంగా ప్రకటిస్తే వరి వంగడాలు కొనుగోలు చేయాలా? లేక అపరాల వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. పొలం అదును పోయే పరిస్థితి వస్తే అపరాల పంటలకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని, సాగు ఖర్చులు రెట్టింపు అవుతాయని అంటున్నారు.