News January 19, 2025
విజయవాడ మీదుగా భువనేశ్వర్‌కు స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- భువనేశ్వర్(BBSR)కు నం.08550 స్పెషల్ రైలు నడుపుతున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదివారం చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:55కు విజయవాడ, సోమవారం ఉదయం 2:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ రైలు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుందన్నారు.
Similar News
News February 13, 2025
MTM: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News February 13, 2025
మచిలీపట్నం: టీ దుకాణదారుడిపై కలెక్టర్ ఆగ్రహం

మచిలీపట్నంలోని ఓ టీ దుకాణదారుడిపై కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ గురువారం ఉదయం స్థానిక మూడు స్థంభాల సెంటర్‌లో పర్యటించారు. సర్వీస్ రోడ్డులో ఉన్న ఓ టీ దుకాణం ముందు తాగేసిన టీ గ్లాసులు ఎడాపెడా పడేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డస్ట్ బిన్‌లో వేయించడం తెలియదా.?’ అంటూ ఫైర్ అయ్యారు.
News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్‌పై తీర్పు

టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.