News August 3, 2024
విజయవాడ మీదుగా రైళ్లు దారి మళ్లింపు

నాగపూర్ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్పూర్ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. రైలు నంబరు 12807/12808 విశాఖపట్నం- హజ్రత్ నిజాముద్దీన్ (ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో), 22815/22816 ఎర్నాకుళం- బిలాస్పూర్ (ఆగస్టు 12, 14 తేదీల్లో), 22847/22848 ఎల్టీటీ ముంబయి- విశాఖపట్నం(ఆగస్టు 18,20 తేదీల్లో) దారి మార్చుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.


