News August 18, 2024
విజయవాడ మీదుగా వన్ వే స్పెషల్ ట్రైన్
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా మధురై- ముజఫర్‌పూర్ (నం.06114) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 7.05 గంటలకు మధురైలో బయలుదేరే ఈ ట్రైన్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 21వ తేదీన 2.45 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుందన్నారు.
Similar News
News September 12, 2024
విజయవాడ: నీటి గోతిలో ఇరుక్కుపోయిన మంత్రి కారు
విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.
News September 12, 2024
విజయవాడ వరద బాధితులకు కీలక ప్రకటన
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.
News September 12, 2024
కృష్ణా:70 మంది వరద బాధితులకు పాము కాటు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.