News September 7, 2024
విజయవాడ: ముమ్మరంగా సాగుతున్న న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్
వరద బాధితులకు అందజేసే న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్ విజయవాడలో ముమ్మరంగా సాగుతోంది. అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఈ ప్యాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఈ కిట్లో ముంపు ప్రాంతాల్లో ఇచ్చేందుకు ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్ ప్యాకెట్లు, రెండు లీటర్ల పాల ప్యాకెట్లు, మూడు నూడిల్స్ ప్యాకెట్లు, రెండు లీటర్ల వాటర్ బాటిళ్ళు ఉంటాయని పేర్కొంది.
Similar News
News October 10, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. Shareit
News October 10, 2024
కృష్ణా: రైతు బజార్లలో అతి తక్కువ ధరకు వంట నూనె
పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనె, టమాటాలు తక్కువ ధరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124, పామోలిన్ లీటరు రూ.114లకు, కేజీ టమాటాలు రూ.50లకు విక్రయించనున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 10, 2024
కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలకు 1734 దరఖాస్తులు
మద్యం దుకాణాలకు సంబంధించి కృష్ణా జిల్లాలో 1734 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మొత్తం 123 దుకాణాలకు గాను బుధవారం రాత్రి 7గంటల సమయానికి ఆన్ లైన్ & ఆఫ్ లైన్లో 1734 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూపేణా రూ.34.68కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చిందన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నామని అన్నారు.