News January 30, 2025
విజయవాడ మెట్రోకు భూసేకరణ.. ప్రభుత్వం ఆదేశం

విజయవాడ మెట్రోకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విజయవాడలో మెట్రోకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. విజయవాడలో మెట్రోకు 101 ఎకరాలు అవసరం కాగా పనులకు ఎంత ఖర్చు అవుతుందో అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను కేంద్రంకు పంపారు. ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News November 10, 2025
పవన్ పర్యటనలో అపశ్రుతిపై కలెక్టర్ క్లారిటీ

AP: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో కాన్వాయ్ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు. పర్యటనలో జనాల తాకిడికి మహిళ సృహతప్పి పడిపోగా తొక్కిసలాటలో కాలికి గాయమైందన్నారు. బాధితురాలిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎడమ కాలుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
News November 10, 2025
జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News November 10, 2025
నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.


