News March 24, 2025
విజయవాడ మెట్రో పనుల్లో ముందడుగు

విజయవాడ మెట్రోకు సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(CMP) సిద్ధం చేసే సంస్థగా సిష్ట్రా MVA కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంపికైంది. ఈ మేరకు ఆ సంస్థకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా లెటర్ ఆఫ్ అవార్డు(LOA) అందజేసినట్లు సమాచారం వెలువడింది. కాగా రూ.11 వేల కోట్ల అంచనా వ్యయంతో 38.40 కి.మీ. మేర ఫేజ్-1లో 2 మెట్రో కారిడార్లను విజయవాడలో ప్రభుత్వం నిర్మించనుంది.
Similar News
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
నక్కపల్లి: చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో మెగా డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు బుధవారం నక్కపల్లిలో తెలిపారు. ఈ మేరకు డీఎస్సీలో ఎంపికైన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను విజయవాడ తరలించేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 85 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,000 మందిని తీసుకువెళ్తున్నామన్నారు.
News September 18, 2025
మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.