News December 3, 2024

విజయవాడ మెట్రో ప్రాజెక్టు వ్యయమెంతంటే.!

image

విజయవాడ మెట్రో మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు మధ్య 38.4 కి.మీ. మేర నిర్మించేలా DPR తయారైంది. దీనికి రూ.11,009కోట్ల వ్యయం అవ్వొచ్చని ప్రభుత్వ అంచనా.1A, 1B కారిడార్‌ల భూసేకరణకు రూ.1,152 కోట్ల వ్యయం రాష్ట్రమే భరిస్తుందని DPRలో పేర్కొంది. కాగా 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య 27.5 కి.మీ. మేర మెట్రో నిర్మించేలా DPR సిద్ధమైంది. 

Similar News

News November 25, 2025

కృష్ణా: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో మొత్తం 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ICDS PD రాణి తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత CDPO ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21-35సం.ల మధ్య వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు.

News November 24, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.