News June 19, 2024
విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి.?
కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. 1991లో దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.
Similar News
News September 16, 2024
వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా
NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News September 16, 2024
కృష్ణా: ‘లా’ విద్యార్థులకు అలర్ట్
కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో B.A.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులేషన్ 2018 & 2023) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 21, 24, 26, 28వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News September 16, 2024
విజయవాడలో రూ.26 లక్షలు పలికిన లడ్డూ
విజయవాడ నున్న గ్రామంలో శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నెలకొల్పారు. ఈ వేడుకల్లో సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్ బాలాజీ వేడుకల చివరి రోజు స్వామివారి లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి వినాయక చవితి వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తామన్నారు.