News February 26, 2026

విజయవాడ: రుణం ఇప్పించండి కలెక్టర్ గారూ..!

image

విజయవాడ బోస్‌నగర్ కండ్రికకు చెందిన దివ్యాంగుడైన మల్లికార్జున నాయుడుస్వామి కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. చిన్న స్టీల్ దుకాణం ప్రారంభించి, కష్టపడి పనిచేస్తూ బతుకు బండిని లాగిస్తున్నానని అన్నారు. స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలనే లక్ష్యంతో రూ.5 లక్షల రుణం మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో తీసుకున్న ముద్రా రుణాన్ని పూర్తిగా చెల్లించానని, ప్రస్తుతం ఎలాంటి బకాయిలు లేవన్నారు.

Similar News

News April 16, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 16, 2026

జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

image

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్‌లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్‌గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.