News November 3, 2024
విజయవాడ: రెండు రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.
Similar News
News December 5, 2025
సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
News December 5, 2025
పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.
News December 5, 2025
ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్ షురూ

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.


