News December 11, 2024
విజయవాడ: రెండు రైళ్లకు అదనపు కోచ్‌లు

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557 & 08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్ ఎకానమీ, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును డిసెంబర్ 14 నుంచి 2025 మార్చి 1 వరకు, నం.08558 MS- VSKP రైలును డిసెంబర్ 15 నుంచి 2025 మార్చి 2 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.
Similar News
News July 8, 2025
మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.
News July 7, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన
News July 7, 2025
మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.