News November 3, 2024

విజయవాడ: రెండు రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు. 

Similar News

News December 13, 2024

కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మచిలీపట్నం, విజయవాడలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

News December 13, 2024

కోర్టులో పేర్నినాని సతీమణి బెయిల్ పిటిషన్

image

సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టుని ఆశ్రయించారు. కాగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు.  పెదపట్నంలో కబ్జా చేసిన 100ఎకరాల మడ అడవుల విషయంలో కూడా పేర్ని నాని శిక్షార్హుడే అన్నారు. అయితే పేర్ని కుటుంబం అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

News December 13, 2024

కృష్ణా: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు.. రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2024లో జరగాల్సిన డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షలు వాయిదా పడినట్లు యూనివర్శిటీ యాజమాన్యం గురువారం తెలిపింది. ఈ పరీక్షలను 2025 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 14 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. రివైజ్డ్ టైం టేబుల్‌కు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని యూనివర్శిటీ తాజాగా ఒక ప్రకటనలో సూచించింది.