News August 8, 2024

విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా

image

విజయవాడలోని ప్రభుత్వ ITI కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో SSC, ITI, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతతో పలు సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 18- 30 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Similar News

News September 15, 2024

తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

image

తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

విస్సన్నపేట: బాలికపై హత్యాచారం

image

విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News September 15, 2024

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో ‘కృష్ణా’

image

జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6363 వివిధ రకాల పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో 5413 క్రిమినల్ కేసులు ఉండగా 181 సివిల్, 484 చెక్ బౌన్స్ కేసులు, 85 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని జిల్లా జడ్జి అరుణ సారెక తెలిపారు.