News April 14, 2025

విజయవాడ: రైలు ప్రయాణికులకు ముఖ్య సూచన 

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే ఒక రైలుకు ఖమ్మం, వరంగల్‌తో సహా 7 స్టేషన్లలో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మే 27, 28 తేదీలలో నం.18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలోని 7 స్టేషన్లలో ఆగదని, ఖాజీపేట మీదుగా కాక ఈ రైలు గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. 

Similar News

News April 17, 2026

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లాలోని 385 పంచాయతీల్లో మొత్తం 12,58,456 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాకినాడ రూరల్‌లో పెండింగ్‌లో ఉన్న 6 పంచాయతీలతో సహా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News April 17, 2026

బుగ్గారం ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులపై కలెక్టర్ తనిఖీ

image

బుగ్గారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ పీడీ రఘువరన్, తహసీల్దార్ భూమేశ్వర్, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వాసవి, సర్పంచ్ నక్క రాజవ్వ, అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రతిభ కనబరిచిన అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేస్తారని తెలిపారు.