News August 9, 2024

విజయవాడ: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం(ERS), పాట్నా(PNBE) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06085 ERS-PNBE ట్రైన్‌ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రతి శుక్రవారం, నం.06086 PNBE-ERS ట్రైన్‌ను ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయంది. 

Similar News

News September 8, 2024

దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్

image

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

News September 8, 2024

వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం

image

అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.

News September 8, 2024

నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.