News February 3, 2025
విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025
Similar News
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


