News May 4, 2024
విజయవాడ రైల్వే డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.
Similar News
News November 27, 2025
కృష్ణా: రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు..!

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కృష్ణా జిల్లా రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర హామీ నీటిపై రాతయ్యిందని అంటున్నారు. ఇక్కడి మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, గోదావరి జిల్లాల మిల్లర్లు 28% తేమ ఉన్న ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
News November 27, 2025
కైకలూరు కృష్ణాజిల్లాలోకి తిరిగి వచ్చేనా..!

ఒకప్పుడు కృష్ణాజిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత YCP హయాంలో కైకలూరును ఏలూరు జిల్లాలోకి తీసుకువెళ్లారు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారు. మరి కూటమి ప్రభుత్వం కైకలూరును జిల్లా పరిథిలోకి తెస్తారో, లేదో చూడాలి.
News November 25, 2025
కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.


