News May 4, 2024

విజయవాడ రైల్వే డివిజన్‌కు రూ.7.96కోట్ల ఆదాయం

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్‌కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.

Similar News

News November 2, 2024

మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి న్యాక్(NAAC) బీ+ గ్రేడ్

image

కృష్ణా యూనివర్సిటీ(KRU)కి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(NAAC) నుంచి అధికారికంగా కృష్ణా యూనివర్సిటీకి న్యాక్ (NAAC) బీ+ గ్రేడ్ అందజేస్తున్నట్లు అధికారిక మెయిల్ వచ్చిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. KRUకి బీ+ గ్రేడ్ లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. 

News November 2, 2024

విజయవాడ: APCRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

విజయవాడలోని APCRDA కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS&రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్&సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకై https://crda.ap.gov.in/Careers/General చూడవచ్చు. 

News November 2, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- కొల్లామ్(QLN) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08539/08540 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08539 VSKP- QLN రైలును నవంబర్ 6 నుంచి 27 వరకు, నం.08540 QLN- VSKP రైలును NOV 7 నుంచి 28 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.