News February 6, 2025

విజయవాడ రైల్వే డివిజన్ ఇకపై ఆ జోన్ పరిధిలోకి

image

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని రైల్వేశాఖ తాజాగా ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ డివిజన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందకి రానుంది. అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి(ఇబ్రహీంపట్నం మండలం)- మోటుమర్రి సెక్షన్ విజయవాడ డివిజన్ కిందకి రానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Similar News

News October 22, 2025

అనకాపల్లి మార్కెట్‌లో పెరిగిన బెల్లం ధరలు

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో మంగళవారం బెల్లం ధరలు పెరిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ రకం 100 కిలోల బెల్లం ధర రూ.6,090కు పెరిగింది. మార్కెట్‌కు 871 బెల్లం దిమ్మలు వచ్చాయి. వీటిలో 1వ రకం 489, రెండవ రకం 244, నల్ల బెల్లం 128 ఉన్నాయి. 2వ రకం రేటు రూ.4,600 పలికింది. 3వ రకం రూ.4,000 పలికకింది. నాగుల చవితి వరకు ఇవే రేట్లు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు భావిస్తున్నారు.

News October 22, 2025

శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాల నిలుపుదల

image

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేశారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి కుంకుమార్చనను ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు. రుద్ర హోమం, చండీ హోమం, నిత్యకల్యాణం వంటి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

News October 22, 2025

సర్వేలో పాలుపంచుకోండి: కలెక్టర్‌ అనుదీప్‌

image

రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనకై ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌–2047’ సిటిజన్‌ సర్వేలో ప్రతి పౌరుడు పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పిలుపునిచ్చారు. ప్రజల నుంచి సూచనలు సేకరించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 25తో సర్వే ముగుస్తుందని, అర్హులైన పౌరులు తమ సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆయన కోరారు.