News January 23, 2025

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

విజయవాడలోని మహానాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జక్కుల వినయ్, జీవన్, గోపి అనే యువకులు ఓ రెస్టాంరెంట్‌లో చెఫ్‌లుగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని స్కూటీపై ముగ్గురు వస్తుండగా మహానాడు జంక్షన్ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గోపి స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 23, 2025

కృష్ణా: కమిషనరేట్‌లో నేతాజీ జయంతి

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్‌లో  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు. 

News January 23, 2025

కృష్ణా: గమనిక..1వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్‌&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని ANU సూచించింది.

News January 23, 2025

జిల్లాను పున‌రుత్పాద‌క ఇంధ‌న హ‌బ్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

ఎన్‌టీఆర్ జిల్లాను పున‌రుత్పాద‌క ఇంధ‌న హ‌బ్‌గా తీర్చిదిద్దే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ‌, ఆధ్వ‌ర్యంలో ఎనికేపాడులో జ‌రిగిన పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న జ‌న‌జాగృతి ర్యాలీలో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా స్థానిక నివాసి ఆర్‌. వీర‌ రాఘ‌వ‌య్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్‌ను పరిశీలించారు.