News July 4, 2024

విజయవాడ- విజయనగరానికి RTC సూపర్ లగ్జరీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విజయనగరానికి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని RTC విజ్ఞప్తి చేసింది.

Similar News

News December 6, 2025

కృష్ణా జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు: కలెక్టర్

image

జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. అనుమానిత, ధృవీకృత కేసులపై ప్రత్యేకంగా ఇంటింటి సర్వేల ద్వారా పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.

News December 5, 2025

‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

image

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.

News December 5, 2025

ఈ నెల 8న కృష్ణా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.