News August 23, 2024
విజయవాడ: విమానంలో మగబిడ్డకు ప్రసవం
సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు.
Similar News
News September 8, 2024
NTR జిల్లాలో వారికి మాత్రమే సెలవు: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వరద ముంపునకు గురైన లేదా పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తోందని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News September 8, 2024
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
News September 8, 2024
వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం
అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.