News March 21, 2024

విజయవాడ వెస్ట్ టికెట్‌పై ముదిరిన వివాదం

image

విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.

Similar News

News April 19, 2026

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

image

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 19, 2026

మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

image

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

పెడన: పేకాడుతూ అరెస్ట్ అయిన మహిళలకు బెయిల్!

image

పెడనలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు పట్టుబడ్డారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో పట్టుబడిన మహిళల్లో ఇద్దరిపై గతంలోనే తొమ్మిది కేసులు ఉన్నట్లు తేలడం విస్మయానికి గురిచేస్తోంది.