News August 25, 2024
విజయవాడ: వేతనాలు చెల్లించాలని మంత్రికి వినతి
విజయవాడ జనసేన కేంద్ర కార్యాలయంలో వాలంటీర్స్ గౌరవ వేతనం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయూన్ భాష ఆదివారం సాయంత్రం వినతి పత్రం ఇచ్చారు. అనంతరం భాష మాట్లాడుతూ.. వాలంటీర్లకి చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. జాబ్ చాట్ ను విడుదల చేసి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
Similar News
News September 7, 2024
లక్షకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాం: మంత్రి సత్యకుమార్
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలోని 32 వార్డు సచివాలయాల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, ఆరు రకాల మందులతో కూడిన లక్షకు పైగా మెడికల్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు డోర్ టు డోర్ మెడికల్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
News September 7, 2024
విశాఖ రైల్ నీర్ ప్లాంట్ నుంచి విజయవాడకు తాగునీరు అందించాలి: YS షర్మిల
విశాఖ రైల్ నీర్ ప్లాంట్ నుంచి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలకు తాగునీరు అందించాలని PCC చీఫ్ YS షర్మిల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం లేఖ రాశారు. వరదల కారణంగా విజయవాడ మున్సిపాలిటీ నుంచి తాగునీరు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం నుంచి నీరు ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
News September 7, 2024
BREAKING: బుడమేరు మూడో గండి పూడ్చివేత
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడిన 90మీటర్ల మూడో గండిని పూడ్చేశారు. నాలుగు రోజులుగా గండి పనులను నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నానికి గండి పూడ్చే పనులు పూర్తయ్యాయి. గండిని పూడ్చడానికి ఆర్మీసైతం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.